రామప్పా! జయహో!!
మహాకవి ఆచార్య సినారె సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన ‘రామప్ప’ నృత్యరూపకంలో, శిల్పసంపద చూసి పులకించిన ఘట్టంలో జాలువారిన భావన అది. ఎనిమిది వందల యేళ్ళ క్రితం ఆకృతి దాల్చిన రామప్ప గుడిలో అపూర్వ శిల్ప కళా వైచిత్రి యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం ‘తెలంగాణ’కు గర్వకారణం.