మహిళా సమాఖ్య టర్నోవర్ కోటి దాటింది!
కరోనా కష్ట సమయంలో ఆరోగ్యం కాపాడుకోడానికి మాస్క్ ధరించటం తప్పనిసరి అయిన పరిస్థితిలో నారాయణపేట మహిళా సమాఖ్య ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంది. ఈ సమాఖ్య ద్వారా నాణ్యమైన మాస్క్ లు తయారు చేయించి తమ జిల్లా ప్రజలకు ఉచితంగా సరఫరా చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా సరఫరా చేసి తగిన ఉపాధి పొందేెందుకు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వారికి స్ఫూర్తినిచ్చారు.