తెలంగాణ గానం

telangana‘తెలంగాణ తల్లి’ కవితా సంకలనం పేరిట వెలువడ్డ ఈ పుస్తకంలో కేవలం కవితలే గాక గేయాలు కూడా వున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కొనియాడుతూ సాగిన కవితలు, పాటలు, వివిధ కవులు రచించిన కొన్ని నానీలు, అన్నింటి సంకలనంగా రూపొందింది ఈ పుస్తకం. ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తియేకాక తెలుగు వారందరూ చదవదగిన చక్కటి పుస్తక సంకలనం. తెలంగాణ ఉద్యమ గీతాలు కూడా వున్న ఈ పుస్తకం ద్వారా తెలంగాణ ఖ్యాతిని అక్కడి ఆర్తిని తెలుసుకోగలిగాం అనే తృప్తి పుస్తకం చదివిన ప్రతి పాఠకుడికి కలుగుతుందనడం సందేహం లేదు.