|

ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్‌… స్పష్టం చేస్తున్న కేంద్రం

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికలు, రిపోర్టులు, ప్రశంసలు స్పష్టం చేస్తున్నాయి.

ఆరోగ్య రంగంలో తెలంగాణ 3వ స్థానం- నీతి అయోగ్‌

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన, నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్య రంగం పురోగతిని నీతి అయోగ్‌ విశ్లేషించి నివేదిక రూపొందించింది. 2018-19లో తెలంగాణ 4వ స్థానంలో ఉండగా, 2019-20లో మూడో స్థానానికి చేరింది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో నిలువగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ మాత్రం చిట్టచివరన నిలిచింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి నుంచి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి.. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని చెప్పడానికి ఈ ర్యాంకు నిదర్శనం. అనేక అంశాల్లో తెలంగాణ మెరుగు పడిరదని నీతి అయోగ్‌ వ్యాఖానించింది. మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ కేటగిరీలో తెలంగాణకు చోటు దక్కింది. ఆరోగ్య తెలంగాణ పురోగతి పట్ల ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. మరోసారి పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

తలసరి ఖర్చులోనూ టాప్‌-3

ప్రజా వైద్యంపై తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చుచేస్తున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇటీవల రాజ్యసభలో తెలిపింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేస్తున్న కృషిని అభినందించింది. ప్రజా వైద్య ఖర్చుల విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని వెల్లడిరచింది. ఒక్కో వ్యక్తిపై ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు రూ. 1698 గా ఉన్నది. హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ తర్వాత తెలంగాణ నిలిచింది.

హెల్త్‌ ఛాంపియన్‌ గా తెలంగాణ..

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత నవంబర్‌ 16 తేదీ నుండి డిసెంబర్‌ 13 వరకు ‘‘హెల్దీ అండ్‌ ఫిట్‌ నేషన్‌’’ క్యాంపెయిన్‌ నిర్వహించింది. మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణకు రెండు దక్కాయి. తద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వెల్నెస్‌ యాక్టివిటీస్‌ లో దేశంలోనే మొదటి స్థానంలో, నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీసెస్‌ స్క్రీనింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్‌ -13న యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజి డే-2021 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢల్లీిలో అవార్డులను బహూకరించింది.