|

సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ టాప్‌

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో (ఏడు సంవత్సరాల కాలంలో) గణనీయమైన సుస్థిరాభి వృద్ధిని సాధించింది. భారత రిజర్వు బ్యాంకు ప్రచురించిన హ్యాండ్‌బుక్‌లో ఈ వివరాలను తెలియచేశారు. బ్యాంకు విడుదల చేసిన గణాంకాలలో అన్ని రంగాలలోను ముందు నిలిచింది. ఏడేండ్ల కాలంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దు కుంది. ముఖ్యంగా 80 శాతం ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో గణనీయ అభివృద్ధిని సాధించింది. దీంతో పాటు ఉత్పాదక, నిర్మాణ, బ్యాంకింగ్‌, సామాజిక, సేవా రంగాల్లో శీఘ్రగతిన పురోగమిస్తున్నది. యావత్తు దేశం ఆశ్చర్యపోయే విధంగా మన అభివృద్ధి సాగి పోతున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేరరావు తన మేథో ఆవిష్కరణగా తెలంగాణను రూపొందించారు. పథకాలు రూపకల్పన చేసి, వాటిని అమలు పరిచి, చిత్తశుద్ధితో చేసిన కార్యాచరణ ఫలితంగానే ఈ అభివృద్ధి సాధ్య మైందని చెప్పక తప్పదు. దీనిఫలితంగా దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కీర్తి గడిరచింది.

 గ్రామీణ తెలంగాణ ప్రజల బ్యాంకు ఖాతాలు నిధులు పెరిగిపోయాయి. గ్రామీణ బ్యాంకుల్లో 2015` 2016 సంవత్సరంలో రూ. 10,700 కోట్లు ఉండగా, 2020`21 నాటికి ఈ డిపాజిట్లు 20,712 కోట్లకు చేరుకున్నాయి. అంటే రెట్టింపు వృద్ధిరేటు జరిగినట్లు తెలుస్తున్నది. దీనివల్ల ప్రజల కొనుగోలుశక్తి పెరిగి వ్యాపారాలు పెరిగిపోయాయి. జీఎస్డీపీ 2013`14లో రూ.4,51,580 ఉంటే, 2020`21లో రూ. 9,80,407గా నమోదైంది. ఇక తలసరి ఆదాయానికి వస్తే 2013`14లో రూ.1,12,162లు ఉండగా, 2020`21లో రూ. 2,37,632గా ఎదుగుదల కనిపిం చింది. వ్యవసాయ ఆదాయం 2014`15లో రూ. 41,706 కోట్లు ఉండగా, 2021`21లో రూ. 80,574 కోట్లకు చేరింది. ఇక పెట్టుబడి వ్యయం 2014`15లో రూ. 11,583 ఉండగా, 2020` 21లో రూ. 44,145 కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. అందుబాటులో 

ఉన్న తలసరి విద్యుత్‌ విషయంలో జాతీయ సగటు 21.08 శాతం ఉండగా, తెలంగాణలో 65.35 శాతం ఉంది. ఇలా రహదారులు, పారిశ్రామిక పెట్టుబడులు, విద్య, వైద్యం, వ్యవసాయం, నిర్మాణ రంగం, సంక్షేమం, బ్యాంకింగ్‌, సేవా తదితర రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించి అభివృద్ధికి చిరునామాగా నిలిచింది తెలంగాణ అని చెప్పక తప్పదు.