నమ్మక తప్పని నిజాలు!

By: దోర్బల బాలశేఖరశర్మ

విజ్ఞానశాస్త్రం (సైన్స్‌) నిత్య నూతనం. వింతలు, విశేషాలనుంచి భూమి, సౌర కుటుంబం, అంతరిక్షం, వాతావరణ మార్పులు, ఆవిష్కరణలు, అన్వేషణలు, ప్రకృతి, జీవజాతులు, సముద్రాలు, శరీర నిర్మాణాలు, వైద్యం వంటి అనేక రంగాలలో సామాన్యులకు తెలియని సత్యాలు ఎన్నో. ఆసక్తికరమైన వాటిని ఈ శీర్షికన తెలుసుకొందాం. 

సముద్రాల నుంచే 50 శాతం ప్రాణవాయువు 

భూమిపై ‘ప్రాణవాయువు (ఆక్సిజన్‌) ఉత్పత్తి’ ప్రధానంగా ‘వర్షారణ్యాల’ నుంచే అని మనకు తెలుసు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్న దాదాపు సగం వరకు ప్రాణవాయువు సముద్రాల నుంచి వస్తున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. సముద్రాలలోని ‘ప్లాం టోన్‌’ (సంచారజీవులు, మొక్కలు: ఇవి ప్రధానంగా రెండు రకాలు: వృక్ష, జంతు సంబంధమైనవి), సముద్ర పాచితోపాటు ఇతరత్రా సాగర సంబంధ మొక్కలలో జరిగే ‘కిరణజన్య సంయోగక్రియ’ల ద్వారానే ఇది సాధ్యమవుతున్నట్టు వారు తేల్చారు.

రేజర్‌ బ్లేడ్‌లనూ కరిగించేంత శక్తి 

మానవ ఉదరంలోని ఆమ్ల ద్రావణాల (యాసిడ్స్‌)కు రేజర్‌ బ్లేడ్‌లనైనా కరిగించే శక్తి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా ఆమ్ల దావ్రణం ప్రామాణిక శ్రేణి సగటు ‘0-14’ జూన (శక్తివంతమైన అత్యల్ప ఆమ్ల ద్రావణం కొలత)గా కొలుస్తారు. మానవ ఉదరంలోని ఆమ్లాల సగటు స్థాయి ఎంతటిదంటే, 1.0-2.0 జూన గా చెబుతున్నారు. అంటే, అవి ఏకంగా రేజర్‌ బ్లేడు వంటి లోహాల్ని సైతం తేలిగ్గా కరిగించేస్తాయన్నమాట.

సింహగర్జన శబ్దవేగం 

మృగరాజు గర్జిస్తే ఆ శబ్దం కనీసం 8 కి.మీ. దూరం వరకూ వినిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సింహాలు సాధారణంగా రోజులో 20 గంటలపాటు విశ్రాంతి తీసుకొంటాయని వారంటున్నారు. ప్రపంచ అతిపెద్ద క్షీరదమైన ఏనుగు రోజుకు 200 లీటర్ల నీరు తాగుతుందట. ఇక, ఆక్టోపస్‌ (ఎనిమిది కాళ్ల సముద్ర జంతువు)లకు మూడు గుండెలు, తొమ్మిది మెదళ్లతోపాటు రక్తం నీలం రంగులో ఉండటం విశేషం.

తారలకన్నా ఎక్కువ సంఖ్యలో వృక్షాలు 

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్‌ ఏరోనాటికల్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) నిపుణుల ప్రకారం ‘మన సూర్యునికి నివాసమైన పాలపుంత (మిల్కీవే)లో మొత్తం 400 బిలియన్‌ (1 బిలియన్‌ 100 కోట్లు) వరకు నక్షత్రాలు వున్నాయి. అయితే, ఒక్క మన భూమిమీది వృక్షాల సంఖ్యే ఇంతకు మించి సుమారు 9 ట్రిలియన్‌ (1 ట్రిలియన్‌ 1 లక్ష కోట్లు) మేర వున్నట్లు వారు చెబుతున్నారు.

గురుత్వ శక్తిని పసిగట్టే జంతువులు 

భూమి గురుత్వాకర్షణ శక్తిని జంతువులు పసిగట్టగలవని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. సముద్ర తాబేళ్లతోసహా కొన్ని రకాల జంతువులకు ఈ అసాధారణ శక్తి ఉంటుందని, భూమి గురుత్వాకర్షణ క్షేత్రశక్తి ఆధారంగానే అవి సముద్రాలలో తాము ఏ ప్రదేశంలో ఉన్నదీ తెలుసుకోగలవనీ వారు అంటున్నారు.

నీలం రంగులో సూర్యాస్తమయం 

భూమిపై నుంచి ఆకాశం, సముద్రజలాలు ఒక్కోసారి నీలం రంగులో కనిపించినట్లుగానే ‘అరుణ’ గ్రహం (అంగారకుడు)పై సూర్యాస్తమయం నీలం రంగులో దర్శనమిస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. కారణం అక్కడి శుద్ధ ధూళికణాలేనని, ఆ సంధ్యవేళ ఆకాశం ఎంతో స్పష్టంగా కనిపిస్తుందని వారంటున్నారు. సాధారణంగా పగటిపూట మాత్రం తుప్పు పట్టిన, ధూళివర్ణంలోనే  ఆకాశం కనిపిస్తుందట.

గుమ్మడి పురుగుల ప్రత్యేకత

గుమ్మడి పురుగులు (Fleas) తమ ఎత్తుకన్నా 130 రెట్లు అధిక ఎత్తుకు ఎగురగలవని జీవశాస్త్రవేత్తలు అంటున్నారు. మన భాషలో అర్థం చేసుకోవాలంటే, ఆరడుగుల మనిషి 780 అడుగుల ఎత్తుకు ఎగిరిన దానితో ఇది సమానం. ఇక, పాములను నిజమైన మాంసాహారులుగా వారు చెప్తారు. ఎందుకంటే, అవి ఏ రకమైన మొక్కలనూ తినవు. కేవలం ఇతర జంతువులను మాత్రమే ఆరగిస్తాయట.

పెద్ద జంతువుకు చిన్న మెదడు 

సుమారు 150-155 మిలియన్‌ సంవత్సరాల కిందట భూమిపై తిరుగాడి నట్లుగా శిలాజ ఆధారాలు లభ్యమైన ‘స్టెనోసారస్‌’ రాక్షసబల్లి (ూ్‌వస్త్రశీంaబతీబం సఱఅశీంaబతీ) ఎత్తు సుమారు 30 అడుగులు కాగా, దాని మెదడు మాత్రం అక్రోటు గింజ (షaశ్రీఅబ్‌) పరిమాణమంత ఉంటుంది. కాగా, స్టార్‌ ఫిష్‌లకు అసలు మెదడే ఉండదుట.

మెదడులో 10 కోట్ల నాడీ కణాలు 

మనిషి మెదడులో మొత్తం 10 కోట్ల (100 బిలియన్‌) నాడీ కణాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటు న్నారు. అలాగే, గుండె రోజుకు సగటున కనీసం ఒక లక్ష పర్యా యాలు కొట్టుకుంటుందని, మన నోటిలో రోజుకు 1 లీటరు లాలా జలం ఉత్పత్తవుతుందని వారంటు న్నారు. ఇంకో ఆసక్తి కరమైన విషయమేమిటంటే, మనిషి దంతాలు షార్క్‌ (సముద్ర చేప) దంతాలకన్నా పదునైనవని వారంటారు.