విజయ హేల

మగటిమి పొంగిపొర్ల యసమాన బలోత్కటమై వెలుంగదే
సొగసుల నద్దుచున్‌ యశము శోభిలగా తెలగాణ రాష్ట్రమే
యగణిత సత్య ధర్మ మయమై మహిమాన్వితమై ముదమ్మునన్‌
ఎగురుచు నుండె మా విజయహేల వచింప పతాక మద్దిరా !

చుక్కలులేని రాత్రివలె శోభదొలంగిన నాదు రాష్ట్రమున్‌
చక్కగ నిల్పినట్టి గుణ చంద్రులు నాయకు లంతయేల తా
మక్కర గండలై బుధ వియచ్చర కోటి నుతించురీతిగా
గ్రక్కున నిల్పినారు తెలగాణను బంగరు సీమగా భళీ !

సీ. ఠీవితో వెలుగొందు పీ.వి.నృసింహుని । జనికి తెలంగాణ వినుత భూష
ఆస్థాన కవియౌచు నలరు దాశరథికి । భూషయౌ తెలగాణ పుట్టినిల్లు
జ్ఞాన పీఠముగొన్న ఘనుడు సి.నా.రె.కు । ముదమొప్ప తెలగాణ పూలదండ,
కల్వకుంట కులాబ్జు ఘను చంద్రశేఖరున్‌ । నిలిపిన తెలగాణ కలువ పూవు
ఇట్టి తెలగాణ సీమలో హృద్య మలర । మీరు మీరలు మీరలు మీరు మీరు
ధన్యగుణులంచు నెంచెద మాన్యులార । వేర లెవ్వారలిక మీకు మీరె సాటి.

సీ. దివ్యాంగ వృద్ధుల తేజమ్ము బెంచుచు । నాసరా పథకమ్ము నమలు సేసె
ధర పల్లె పల్లెలన్‌ త్రాగునీటి నొసంగి । మిషను భగీరథన్‌ తృషిగ నొసగె
చెఱువుల నిండిరచి చిత్రమ్ముగా మిషన్‌ । కాకతీయాఖ్య విఖ్యాతి బెంచె
విద్యార్థి కోటికి విద్య నందించగా । గురుకులాశ్రమాల సరళి బెంచె
లెక్కలేనన్ని పథకముల్‌ పెక్కులిచ్చె । రాష్ట్ర విభవమ్ము నిలిపి ధీ రతుడునయ్యె !
చంద్రశేఖరు డాశయ సాధనమున । మహిత యశమునుగను ముఖ్యమంత్రియయ్యె !

సీ. సంస్కరణమ్ములన్‌ సంతోషముగజేసి । సౌజన్య సంపదన్‌ సతము నిలిపి
సర్వ మతమ్ముల సమముగ ప్రేమించి । విజ్ఞాన ఖనియంచు వినుతి గాంచి
కమనీయ భావనా కల్పలతగ నున్న । సాహితీ క్షేత్రమ్ము సాగుచేసి
ధీగుణోపేతమై దీప్తిని పండిరచు । రాజకీయములకు తేజమిచ్చి
మింట వెలుగొందు ఱేచుక్క నంటురీతి । నేతలందున మేటిjైు నిలిచినట్టి !
చంద్రశేఖర రావుకు సుగుణ నిధికి । నందజేయుదు బంధురానంద నతులు !

- మద్దూరి రామమూర్తి