చెన్నారెడ్డి, కొండ లక్ష్మణ్ అరెస్ట్లలకు నిరసన

ఆకుపచ్చని-పొద్దు-పొడువాలేతెలంగాణా ప్రజాసమితి నాయకుల అరెస్టుకు నిరసనగా 1969 జూన్‌ 25న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో, తెలంగాణ జిల్లాల్లో వేలాది మంది విద్యార్థులు, ఎన్‌జివోలు, ప్రజలు ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించారు. జంటనగరాల్లో బంద్‌ జరిగింది. ప్రదర్శకులను చెదరగొట్టడానికి కాల్పులు, మూడు-నాలుగు సార్లు భాష్ఫవాయువు  ప్రయోగం, లాఠీ ఛార్జీ జరిపారు పోలీసులు. కొన్ని చోట్ల టెలిఫోన్‌ తీగలను తెంపి వేయడంతో సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది. ముందు జాగ్రత్తగా ఆర్‌.టి.సి. బస్సులన్నింటిని బంద్‌ చేసింది. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు.

నాయకులను అరెస్టు చేసిన వార్త దావానంలా వ్యాపించింది. నిషేధాజ్ఞులున్నప్పటికి ప్రజలు గుంపులు, గుంపులుగా చేరి అరెస్టు వార్తను చర్చించుకున్నారు.

ముషీరాబాద్‌ జైలులో ఖైదీలపై లాఠీఛార్జీకి నిరసనగా బంద్‌ జరపాలని క్రితం రాత్రి పొద్దుపోయిన తరువాత తెలంగాణ ప్రజాసమితి నిర్ణయించింది. అప్పటికి నాయకుల అరెస్టు జరగలేదు. తరువాత నాయకుల అరెస్టుకు నిరసనగా బంద్‌ జరపాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌ వద్ద గల నెహ్రూ విగ్రహం సమీపంలో, సికింద్రాబాద్‌లోని మార్కెట్‌ వద్ద సత్యాగ్రహం చేయాని సంకల్పించిన విద్యార్థులపై లాఠీఛార్జి జరిపినారు పోలీసులు.

పోలీసులపై జనం దాడి

హైదరాబాద్‌లోని గౌలిగూడా ప్రాంతంలో పోలీసు బృందానికి, ప్రదర్శకులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసు ప్రదర్శకులపై కాల్పులు జరిపారు. జనం పోలీసులపైకి బాణా సంచా, రాళ్ళు, సోడాబుడ్లు విసిరారు. ఈ కాల్పుల్లో  చాలా మంది గాయపడ్డారు. జనం విసిరిన రాళ్ళ దెబ్బకు అసిస్టెంట్‌ పోలీసు కమీషనర్‌తో సహా ఇద్దరు సబ్‌ ఇన్స్‌పెక్టర్లు గాయపడినారు.

ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం ఇలా ఉంది.

ఒక క్రాస్‌ రోడ్‌ (గౌలిగూడ) వద్ద ఉన్న కేంద్ర రిజర్వు పోలీసుపై ముందుగా ఆందోళనకారులు దాడి చేశారు. రాళ్ళు రువ్వడం ఉధృతమైనప్పుడు పోలీసు ఒక రౌండు కాల్పులు జరిపి ఆ సమయంలో తమ ఆయుధాలు వుంచిన దుకాణంలోకి వెళ్ళారు. ఆ తర్వాత ఆందోళనకారులు దానిపై దాడిచేసి షట్టర్‌ పగులగొట్టి దుకాణంలోకి ప్రవేశించి పోలీసులను కొట్టినారు. ఈ సంఘర్షణలో ఒక పోలీసు తలకు దెబ్బతగులగా అతనిని ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. మరొక పోలీసు బృందం అక్కడకు వచ్చి భాష్పవాయువు ప్రయోగించి, కేంద్ర రిజర్వు పోలీసులను కాపాడినారు. ఆ ప్రాంతంలో రోడ్డు పొడవునా ఆందోళనకారులు అడ్డంకులు కల్పించారు. పెక్కు ప్రాంతాలలో రోడ్డుపై అవరోధాలను తొలగించడానికి అదనపు పోలీసు బలగాను పిలిపించవలసి వచ్చింది.

అవరోధాలు – అడ్డంకులు 

కవాడిగూడ, సుల్తాన్‌బజార్‌, ముషీరాబాద్‌, పుత్లీబౌళి, ఇతర ప్రాంతాలో రహదారుకు అవరోధాలు కల్పించారు. చిక్కడపల్లి, గౌలిగూడ, బేగంబజార్‌, మక్‌పేట, సీతాఫల్‌మండి, కింగ్స్‌ వే తదితర ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు రోడ్లపై అవరోధాలు కల్పించారు.

మీటర్‌ గేజ్‌ సెక్షన్‌లో సబర్బన్‌ రైళ్ళరాకపోకలకు నాటి ఉదయం అవరోధం ఏర్పడింది. ఉప్పుగూడ స్టేషన్‌ వద్ద దాదాపు నాలుగు వందల మంది ప్రదర్శకులు రైలు మార్గంపై కూర్చున్నారు. అదనపు పోలీసుదళాలు అక్కడికి వెళ్ళి వారిని తరిమివేసారు. ఆందోళనకారులు సికింద్రాబాద్‌ – వాడి సెక్షన్‌లో రైలు మార్గంపై (గోడం గూడా) 60కి పైగా పెద్దపెద్ద రాళ్ళను పెట్టినారు. రాళ్ళను గుర్తించి గూడ్సు డ్రైవర్‌ రైలును నిలిపివేసారు. ఆ దారిలో రైళ్ళు కొద్ది గంటలు నిలిచిపోయాయి. ఆలేరు స్టేషన్‌ వద్ద సికింద్రాబాద్‌-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ను ప్రదర్శకులు అలారం గొలుసులాగి నిలిపివేశారు. శ్రీధర్‌ రెడ్డి, డా॥ చెన్నారెడ్డి ఆధ్వర్యంలోని రెండు ప్రజాసమితి సంస్థలు బంద్‌కు పిలుపునివ్వడంతో తెలంగాణ అంతటా బంద్‌ విజయవంతమైంది.

తెలంగాణ సమస్య చేయిదాటిపోయిందని మాజీ కేంద్రమంత్రి ఎస్‌.కె. పాటిల్‌ మద్రాసులో అన్నారు. రాష్ట్ర ప్రజ క్షేమం దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ క్షేమం దృష్ట్యా ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాలంటూ శాసనమండలి సభ్యుడు షంషీర్‌ బేగ్‌ ఒక ప్రకటన చేశారు. తెలంగాణ సమస్య విషయంలో కేంద్రప్రభుత్వం లెక్కలేకుండా వ్యవహరిస్తున్నదని సి.సి.ఐ. ప్రధాన కార్యదర్శి సి.రాజేశ్వరరావు విమర్శించారు.

‘హైదరాబాద్‌కు ప్రధానమంత్రి, హోం మంత్రి చవాన్‌ ఇటీవల వెళ్ళగా ఏర్పడిన మంచి వాతావరణం, కలిగిన గౌరవం ఆ సమస్యను కాంగ్రెస్‌ పార్టీ ఆంతరంగిక వ్యవహారంగా పరిగణించడంతో అంతా వృథాఅయింది. అని రాజేశ్వర రావు అభిప్రాయపడినారు. బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాలని ప్రజాసోషలిస్టు పార్టీ అధ్యక్షుడు ఎన్‌.జి.గోరె అన్నారు. తెలంగాణ ప్రజాసమితి నాయకులు అరెస్టు వల్ల తెలంగాణ ఆందోళన ఆగబోదని హోం మంత్రి చవాన్‌కు తెలంగాణ రీజనల్‌ కమిటీ ఛైర్మన్‌ చొక్కారావు స్పష్టం చేశారు.

సత్యాగ్రహం ఉధృతం చేయాని టి.పి.ఎస్‌ నిర్ణయం:

సత్యాగ్రహం ఉధృతం చేయాని మదన్‌మోహన్‌ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ ప్రజాసమితి కార్యకర్తలు, నాయకులు నిర్ణయించారు. ఈ సత్యాగ్రహం రెండుదశలుగా జరుగుతుందని మదన్‌ మోహన్‌ చెప్పారు. తెలంగాణ మంత్రు ఇళ్ళ ముందు, ఉద్యమంలో పాల్గొనని ఎం.ఎల్‌.ఏ ఇళ్ళ ముందు ధర్నాలు చేయాలని, రైలు మార్గంపై బైఠాయించాలని నిర్ణయించారు.

గౌలిగూడలో రెండో రోజు కూడా కాల్పులు – ఒకరి మృతి

ప్రజాసమితి నాయకుల అరెస్టుకు నిరసనగా జూన్‌26న రెండోరోజు ఆందోళనలు మరింత తీవ్రమైనవి. గౌలిగూడలో జూన్‌ 25న ప్రదర్శకులకు, కేంద్ర రిజర్వు పోలీసులకు మధ్య ఘర్షణ సందర్భంగా కాల్పులు జరిపారు. జూన్‌ 26న మళ్ళీ ఇవే సంఘటనలు గౌలిగూడలో పునరావృతమైనవి. ఈ రోజు సుమారు 3 గంటపాటు గౌలిగూడలో ప్రదర్శకులకు, కేంద్ర రిజర్వు పోలీసులకు మధ్య సంఘర్షణ జరిగింది. గౌలిగూడ సిటీ బస్సుడిపో వద్ద కార్మికులపై పోలీసులు భాష్ఫవాయువును ప్రయోగించారు. అసంఖ్యాకంగా గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి లాఠీఛార్జి చేసారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. ఈ సంఘటనలో కొందరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు. ఈ కాల్పులను  విద్యార్థినాయకుడు మల్లికార్జున్‌, ఎన్‌.ఎస్‌.పి నాయకుడు బి. సత్యనారాయణరెడ్డి ఖండించారు.

సికింద్రాబాద్‌లో బంద్‌:

తెలంగాణ నాయకులను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపినందుకు నిరసనగా సికింద్రాబాద్‌లో జూన్‌ 26న బంద్‌ జరిగింది. దుకాణాలు, హోటళ్ళు ఇతర వ్యాపార సంస్థలు మూసివేసారు. సికింద్రాబాద్‌ ప్రజాసమితి నాయకులు సమావేశమై తెలంగాణ నాయకులను తెలంగాణ ప్రాంతంలోని జైలుకు లేదా ఆంధ్రప్రాంతం మినహా దేశంలో మరే ప్రాంతంలో జైలుకైనా తరలించాలని కోరారు. నాయకుల అరెస్టుకు నిరసన తెలుపుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు వాణిజ్య సంస్థలు  టెలిగ్రాం పంపాయి.

ప్రజాసమితి వాంటీర్లు పరిశ్రమల శాఖా మంత్రి బి.వి. గురుమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి అరిగె రామస్వామి గార్ల ఇళ్ళముందు ధర్నా జరిపారు.

మిర్యాగూడలో పోలీసు కాల్పులు – ఒకరి మృతి

నల్లగొండ జిల్లా మిర్యాగూడెం బస్‌స్టాండ్‌ వద్ద ఏర్పరచిన పోలీసుగస్తీ కేంద్రం వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు.

ఉపాధ్యాయ సంఘం ఖండన:

నాయకుల  అరెస్టు, వారిని రాజమండ్రి జైలుకు పంపడాన్ని ఖండిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎం.బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటన చేసారు. విద్యా సంస్థలను జైళ్లుగా మార్చడాన్ని కూడా ఆయన విమర్శించారు.

మంత్రుల రాజీనామాకై నేతల భార్యల డిమాండ్‌:

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నరోత్తమ రెడ్డి సతీమణి శ్రీమతి సులోచన, శ్రీమతి టి.అచ్యుతరెడ్డి నేడు తెంగాణ మంత్రుల గృహాలకు వెళ్ళి మంత్రి పదవుకు రాజీనామా ఇవ్వాని కోరారు. కార్మిక శాఖా మంత్రి కె.వి. నారాయణ రెడ్డికి వారు తెలంగాణ ఆందోళనకారులపై పోలీసులు గైకొంటున్న చర్యలను గురించి వివరించారు. మరుసటి రోజులోగా రాజీనామా ఇవ్వడం గురించి నిర్ణయించుకొనవసిందిగా వారు మంత్రికి తెలియజేశారు. (1952లో ముల్కీ ఉద్యమాన్ని కె.వి.నారాయణరెడ్డి సమర్థించారు. 1955-56లో తెలంగాణను ఆంధ్రతో కలపవద్దని ఆందోళన చేసారు.)

ఆ తర్వాత ఈ మహిళలు  వి.బి. రాజు ఇంటికి వెళ్ళారు. (వి.బి.రాజు 1952-56లో బూర్గు రామకృష్ణారావు మంత్రి వర్గంలో సభ్యుడైన ఆంధ్ర ప్రాంతీయుడు. విశాలాంధ్ర కోసం గట్టిగా పోరాడిన తెలంగాణ వ్యతిరేకి.) తెలంగాణ నేతలను విశాలాంధ్ర కోసం ఒప్పించడానికి లాబీయింగ్‌ జరిపిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి వి.బి.రాజు ఇంటి వద్ద ఆందోళనకారులు తెలంగాణ నినాదాలిస్తూ ధర్నా జరిపారు. మంత్రితో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతీయ సంఘం ఛైర్మన్‌ అయిన చొక్కారావు ఇంటివద్ద కూడా ధర్నా జరిగింది. ఉద్యమకారులతో చొక్కారావు మాట్లాడినారు.

ఆంధ్ర-తెలంగాణ ఏకీకరణలో ముఖ్యపాత్రధారి, మంత్రి గురుమూర్తి ఇంటివద్ద కూడా ఆందోళనకాయి రాజీనామా కోరుతూ ధర్నా చేశారు.

తెలంగాణలో కొనసాగుతున్న అరెస్టు: డా॥ చెన్నారెడ్డితో మొదలైన అరెస్టు పర్వం జూన్‌ 25, 26న కూడా కొనసాగింది. తెలంగాణ నేతలను ఎక్కడ కనబడితే అక్కడ ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ కింద అరెస్టు చేస్తూనే ఉన్నారు. వీరిలో సమితి అధ్యక్షులు, జర్నలిస్టులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. తెంగాణ ప్రాంతీయ సంఘం మాజీ అధ్యక్షుడు టి.హయగ్రీవాచారి, హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి ఎల్‌. నారాయణ్‌, మెదక్‌ జిల్లాలో పంచాయతీ సమితి అధ్యక్షుడు టి.రామచంద్రారెడ్డి, జడ్‌చర్ల సమితి అధ్యక్షుడు రఘునందన్‌ రెడ్డి, పటాంచెర్వు పంచాయితీ సమితి ఉపాధ్యక్షుడు పి.వీరప్పను ప్రవెంటివ్‌ డిటెన్షన్‌ క్రింద అరెస్టు చేసారు. తెలంగాణలోని అన్ని పట్టణాలో, జిల్లా కేంద్రాలో వందలాదిమంది తెలంగాణ నాయకులను, ఆందోళనకారులను అరెస్టు చేసారు.

ప్రజాసమితి అధ్యక్షునిగా మదన్‌మోహన్‌:

డాక్టర్‌ చెన్నారెడ్డి అరెస్టు తర్వాత తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షునిగా జూన్‌ 25న మదన్‌మోహన్‌ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణను సందర్శించమని దేశనాయకులను మదన్‌మోహన్‌ కోరినారు. పోలీసు జరుపుతున్నఅకృత్యాలను ఆయన ఒక ప్రకటనలో ఖండించారు.

అరెస్టులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప బెంగుళూరులో అన్నారు. ‘తెంగాణ సమస్యపై ప్రజాభిప్రాయసేకరణకు కాంగ్రెస్‌ అధిష్టానవర్గం ఎందుకు ఆమోదించదు?’ అన్న విలేకరి ప్రశ్నకు జవాబిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ ప్రతిపాదనకు ఎవరూ ప్రాధాన్యమివ్వడం లేదు అని చెప్పారు.

అరెస్టులను గురించి తాను పత్రికలోనే చదివానని, ఎవరితోనూ మాట్లాడలేదని నిజలింగప్ప అన్నారు. జంటనగరాలలో కాల్పులు జరపడం పట్ల నిజలింగప్ప విచారాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణలో త్వరితగతిని వస్తున్న పరిణామాల పట్ల కేంద్ర రక్షణ శాఖ ఉపమంత్రి యం.ఆర్‌.కృష్ణ ఆందోళన వ్యక్తపరిచారు. ఈ దశలోనైనా వివేకోదయం కలుగ గలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్త్తపరిచారు. కొత్తగా మరే పొరబాటు చర్య గైకొన్నప్పటికీ పరిస్థితి విషమించగలదు. దాని వలన సమస్య పరిష్కారం అసాధ్య కాగలదని కృష్ణ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని తెలంగాణ పరిణామాలపై ప్రధాని, కేంద్ర హోంమంత్రితో మాట్లాడడానికి కృష్ణ ఢిల్లీకి 25న బయుదేరారు. కృష్ణ తెలంగాణకు చెందినవాడు.

తెలంగాణ పరిణామాలపై ఉప ప్రధాని మొరార్జీదేశాయ్‌, హోంమంత్రి వై.బి.చవాన్‌తో జూన్‌ 26న మాజీమంత్రి దామోదరం సంజీవయ్య చర్చించారు. నాయకుల అరెస్టుతో సామరస్య పూర్వక పరిష్కారానికి అవకాశాలు సన్నగిల్లినట్లు వారికి వివరించారు.

అగ్రనాయకుల సలహా ప్రకారమే అరెస్టు – సి.ఎం.

రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనకున్నదని, తాను ఏమి చేసినా అగ్రనాయకుల సలహా ప్రకారమే చేశానని కాసు బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. పత్రిక వారితో హైదరాబాద్‌లో సి.ఎం. మాట్లాడుతూ..

‘ఆందోళనలు విరమించాలని ఉప ప్రధాని మురార్జీ దేశాయ్‌ చేసిన విజ్ఞప్తిని ప్రజాసమితి నాయకులు త్రోసిపుచ్చారు. అందువల్ల  ఫలితం వేరేవిధంగా ఉన్నది’ అని అన్నారు.

రాజధానిలో కంటె రాజమండ్రి జైలులో ఇతోధిక సౌకర్యాలుండడమే అక్కడికి పంపడానికి కారణమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

డిటెన్యూల రక్షణ, భద్రత విషయమై ఆందోళన చెందవలసిన పని లేదని తనను కలిసిన శ్రీమతి చెన్నారెడ్డి, శ్రీమతి కొండా లక్ష్మణ్‌కు తాను హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి విలేకరులకు తెలిపారు.

ప్రాంతీయ సంఘానికి ఇతోధిక అధికారాలు : సి.ఎం.

తెలంగాణ ప్రాంతీయ సంఘం ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుండి చేసిన 54 సిఫార్సులో 51 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందని బ్రహానందరెడ్డి విలేకరులకు తెలిపారు. రీజనల్‌ కమిటీకి ఇతోధికాధికారాలు ఇచ్చే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు  కేంద్ర హోం శాఖ పరిశీలనలో ఉన్నదని ఆయన అన్నారు.