|

భాషా, సాంస్కృతిక శాఖకు ‘జీ’ సినిమా అవార్డు

tsmagazine
‘జీ’ సినిమా అవార్డును రాష్ట్ర భాషా,సాంస్కృతిక శాఖ,సినీరంగంలో తెలంగాణ యువత ప్రాధాన్యతను పెంపొందించాలనే వుద్దేశంతో, రవీంద్రభారతిలో వున్న ‘పైడి జైరాజ్‌’ ప్రివ్యూ థియేటర్‌ వేదికగా సినీవారం, సండే సినిమా, ఫైంటాస్టిక్‌ ఫైన్‌ ఫిలిం ఫెస్టివల్‌, వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపట్టి యువ సినీనిర్మాణం పై అవగాహన కలుగజేస్తున్నది. ఈ కృషిని గుర్తించిన ‘జీ’ సినిమా సంస్థ, భాషా,సాంస్కృతిక శాఖకు ‘జీ’ సినిమా అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో భాషా,సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ అందుకున్నారు