శతవసంతాల యక్షగాన కళాకారుడు వైద్యం గోపాల్
పూర్వం తెలంగాణలో యక్షగానాలు (వీధి భాగవతాలు), తోలుబొమ్మలాటలు, పగటి వేషాలు, చిందు ఆటలు, ఒగ్గు కథలు ఇంకా అనేక జానపద కళారూపాలు ప్రజలకు వినోద విజ్ఞాన దాయకాలు. క్రమ క్రమంగా సినిమాలు, టీవీలు జన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత ప్రపంచీకరణ ప్రభావంతో జానపద కళలన్నీ కనుమరుగయ్యాయి.