అక్షర రూపంలో తరతరాల వైభవం
తెలంగాణ గడ్డ ఉజ్వలమైన చరిత్రకు, సుసంపన్నమైన భాషా సాహిత్యాలకు, తరతరాలుగా జనావళిని ఉర్రూతలూగిస్తున్న కళారూపాలకు, విలక్షణ సంస్కృతికి ఆటపట్టు. తెలంగాణ గొప్పదనం తెలియని వారు మాట్లాడిన హేళన పూర్వక మాటలే అలనాడు సురవరం ప్రతాప రెడ్డిని గోలకొండ కవుల సంచిక రూపకల్పనకు పురి గొల్పినవి.