లక్షలాది మందికి గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన
భారత స్వాతంత్ర వజ్రోత్స వాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శించబడుతున్న గాంధి చలనచిత్రానికి విశేష స్పందన లభిస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు.
భారత స్వాతంత్ర వజ్రోత్స వాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శించబడుతున్న గాంధి చలనచిత్రానికి విశేష స్పందన లభిస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన ‘బలగం’ సినిమా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజనల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ,
అంతర్జాతీయ సినిమా వేడుకలు జరిగినప్పుడు మనం ఒక మాట వింటుంటాము. అందులో ప్రదర్శింపబడే కొన్ని సినిమాలు చూసినపుడు సినిమా తీయబడిన ప్రాంతం సంస్కృతిని, సంప్రదాయాన్ని, ప్రగతిని అన్నింటిని అంచనా వేయవచ్చు. నిజమే ముఖ…
యూరోప్‌లోని పోర్చుగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ”విజిట్ తెలంగాణ ” ఫిల్మ్‌కు ‘బెస్ట్ ఆసియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు’ గెలుచుకున్న సందర్భంగా అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం స్వీకరించారు.
సాహిత్యం, సంగీతం అభినయం-ఇట్లా అన్ని కళలు కలిస్తే ‘సినిమా’! సినిమాను ప్రధానంగా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. అది ‘కళ’-‘వ్యాపారం’ కూడా! ఇరవైనాలుగు కళా, నైపుణ్య విభాగాల్లో అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ-చిత్ర పరిశ్రమ.
బాలీవుడ్‌లో మూకీల కాలంలోనే తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించిన తొలి తెలుగు నటుడు పైడిజైరాజ్ నాయుడు. ఏడు దశాబ్దాల నట జీవితాన్ని గడిపి చరిత్రకెక్కిన మహానటుడాయన. నటుడిగానే కాక దర్శకునిగా, నిర్మాతగా హిందీ రంగంలో తనదైన ముద్ర వేశారు. సరోజినీనాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకు స్వయాన మేనల్లుడాయన. 1909 సెప్టెంబర్ 28న కరీంనగర్‌లో జన్మించారాయన.
మధురమైన పాటల దండ దాశరథి సినిమా పాటలు పుస్తకం. సినిమా మాధ్యమం ఆబాల గోపాలానికి అందుబాటులో వుండే గొప్ప సాధనం. ఆ సాధన మాధ్యమం ద్వారా ఏది అందించినా కోట్లాది మందికి చేరువవు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
సాంస్కృతికంగా సామాజికంగా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణసినిమా ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగరేసింది తెలంగాణ సినిమానే.