భారత్ విక్రమం
విశ్వ మండలం విస్తుపోయింది.
చంద్రయానం చరిత్ర రాసింది.
ప్రజ్ఞాన విక్రమము వెన్నెల పై విచ్చుకుంది.
విశ్వమంతా జయ జయ ధ్వానం పలికింది.
విశ్వ మండలం విస్తుపోయింది.
చంద్రయానం చరిత్ర రాసింది.
ప్రజ్ఞాన విక్రమము వెన్నెల పై విచ్చుకుంది.
విశ్వమంతా జయ జయ ధ్వానం పలికింది.
భారత స్వాతంత్ర వజ్రోత్స వాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శించబడుతున్న గాంధి చలనచిత్రానికి విశేష స్పందన లభిస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు.
ఎక్కడ పువ్వు రాలేదో అక్కడ గజ్జె ఘల్లుమనేది
ఎక్కడ నవ్వు పొలమారేదో అక్కడ ఆ గొంతు పురివిప్పేది
ఏడ్పులకు సంతోషాలకు మధ్య
కన్నీళ్లు ప్రవహించినప్పుడల్లా వంతెన కట్టేది ఆ పాట
హైదరాబాద్ లోని సియాసత్ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (63) అటువంటి అరుదైన వ్యక్తిత్వం కలవారు. ఆయన దేశశ్రేయాన్ని అభిలషించేవారు. అలాంటి జహీరుద్దీన్ తమ కుటుంబాన్ని, ‘సియాసత్’ సంస్థని, తన మిత్రులను కన్నీళ్లపాలు చేసి 2023 ఆగస్టు 7 సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
తడారిపోయింది స్వరమాగిపోయింది
పొద్దుపొడుపు నలుపైంది
ఆకాశమంత మర్రిమాను నేలకూలింది
ఇప్పుడు పాట
మనముందు జెండయి నిలబడ్డది
పేద ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా ప్రజాస్వామ్యం పరిరక్షణే లక్ష్యంగా, ఊపిరిగా జీవించి దేశమంతా హోరెత్తించిన ఒక ప్రజల గొంతుక అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ మట్టి పొత్తిళ్లలో గర్జనై ఘోషించిన కాలి అందెల సవ్వడి వినిపించకుండా పోయింది. ఆగస్టు 6న కనుమూసిన ఆ ప్రజాకవి గద్దర్.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
సీ: జనములు మెచ్చంగ జనపథమ్ములు కొన్ని
దేదీప్యముగను వర్ధిల్లె నిచట
దేశ విదేశ యాత్రికులతో రాజ్య వై
భోగమ్ములే మారిపోయె నిచట
తెలంగాణ సాధించుకున్న తర్వాత సాహిత్యం కూడా కొత్త వెలుగును నింపుకుంది. అస్తిత్వాన్ని అన్వేషించుకుంది. స్థానాన్ని నిర్దేశించుకుంది. చిత్ర పరిశ్రమలో ఇంతకాలంగా తెలంగాణ భాషను వ్యంగ్యంగా చిత్రించిన దశనుండి ఆ భాష సొగసులను, సౌందర్యాన్ని, మాధుర్యాన్ని తెలిజేస్తూ వెండి తెరపై మెరుపులు ప్రదర్శించింది.
ఆధిపత్యాల అవమానాల పోరులో ఆత్మగౌరవానికై నేలకొరిగిన ధృవతారాల్లారా !
మీకు తంగేడు పూలవందనాలు !
భవిష్యత్ ను ఉద్యమానికి అంకితంచేసి పోలీసుల కాల్పుల్లో కన్నుమూసిన వీరులారా!
మీకు పాటల దండాలు!