ఆధ్యాత్మిక పర్యాటకానికి సరికొత్త చిరునామా
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రం పర్యాటక రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తోంది.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రం పర్యాటక రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తోంది.
తెలంగాణా బౌద్ధ వారసత్వవనంగా బుద్ధవనం నిలువబోతోంది. బుద్ధుని జీవితకాలంలోనే తెలంగాణ నేలలో ప్రవేశించిన బౌద్ధం అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు బౌద్ధ పరిమళాలతో పరిఢవిల్లిన నేలలో సుమారు ముప్పైకి పైగా చారిత్రక బౌద్ధ స్థలాలు నేటికీ నిలిచివున్నాయి.
దేశంలో పాలమూరు జిల్లా పేరు తెలియని వారు ఉండరు. అంతేకాక అగ్గి పెట్టెలో పట్టె గద్వాల చేనేత చీరలు, కొత్తకోట చేనేతలు, నారాయణపేట కంబళ్లతో పాటు, పాత రాతి యుగం,మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం ఆనవాళ్లకు ఎన్నో శిల్పాలు,శాసనాలు,దేవాలయాలు, పనిముట్లు, మరెన్నో అద్భుత కట్టడాలకు నిలయం ఈ జిల్లా.
యాదాద్రి భువనగిరి జిల్లాకి పేరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పేర వచ్చింది. నిజానికి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక చారిత్రక అవశేషం శాసనమో, స్మారక శిలో, వీరగల్లో, గడీలో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి.
ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ఒక కుంభ మేళా, శబరిమల అయ్యప్ప మకర జ్యోతి దర్శనం, మక్కా సందర్శనను చేసే లక్షలాది భక్తుల మాదిరిగానే దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రోజుల్లోనే దాదాపు ఒక కోటి కి పైగానే భక్తులు సందర్శిస్తారు.
ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు నేడు లకారం ట్యాంక్ గా మారి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తున్నది.చెరువుల పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రూపురేఖలు మార్చుకొని నగరానికే తలమానికంగా నిలిచింది.
మిషన్ కాకతీయలో బాగంగా నియోజకవర్గంలోని చెరువులను మినీ ట్యాంక్ బండ్‌గా పునరుద్దరిస్తున్నారు. ఆ సందర్భంగా నాగర్ కర్నూల్ చెరువు కేసరి సముద్రాన్ని మినీ ట్యాంక్ బండ్‌గా సుందర పర్యాటకంగా తీర్చి దిద్దుతున్నారు.
హైదరాబాద్ టాంక్ బండ్‌కి ధీటుగా భద్రకాళి బండ్‌ను మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిర్మించారు. అడుగడుగునా ప్రత్యేకతలు నిలుపుకున్న ఈ పార్క్ పై ప్రత్యేక కథనం.
నీటి పై తేలియాడే మ్యూజికల్ ఫౌంటెయిన్, జల దృశ్యం, మ్యూజిక్‌తో పాటు.. విద్యుత్ కాంతులతో సిద్ధిపేటలోని, కోమటి చెరువు సరికొత్త సొబగులు అద్దుకుంటూ వీక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. ఈ సంగీత జల దృశ్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారం శ్రవణా నక్షత్రయుక్త మిధున లగ్నంలో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారయింది.