బంగారు తెలంగాణ

మన గ్రామాలకు జాతీయ అవార్డుల పంట

మన గ్రామాలకు జాతీయ అవార్డుల పంట

పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి విభాగాలలో దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరచి, తెలంగాణ రాష్ట్రం 13 జాతీయ పురస్కారాలు కైవసం చేసుకుంది.

పునర్నిర్మాణ ప్రతీకలు

పునర్నిర్మాణ ప్రతీకలు

మనం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించుకున్న సచివాలయ సౌధం పునర్నిర్మాణం చేసుకున్న తెలంగాణకు ప్రతీకగా నిలిస్తున్నది: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

సాకారమవుతున్న జిల్లాకో వైద్య కళాశాల

సాకారమవుతున్న జిల్లాకో వైద్య కళాశాల

ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం సాకారమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 5 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా, తెలంగాణ వచ్చాక ఏర్పడిన మొత్తం 33 జిల్లాలలో ఇప్పటికి 12 జిల్లాలలో కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటు జరిగింది.

పిల్లలు పాఠాలు ‘చూస్తున్నారు’…

పిల్లలు పాఠాలు ‘చూస్తున్నారు’…

చదివిన దాని కన్నా చూసిందే ఎక్కువగా గుర్తుంటుంది. అంతకు మించి బాగా అర్థమవుతుంది. ఈ కాలంలో 2డీ, 3డీ యానిమేషన్‌ దృశ్యరూప విద్యా బోధన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 3డీ యానిమేషన్‌ లో కళ్ళ ముందు కదిలే పదవ తరగతి పాఠ్యాంశాలు వచ్చాయి.

ఈ అభివృద్ధి మనకు గర్వకారణం

ఈ అభివృద్ధి మనకు గర్వకారణం

మహబూబ్‌నగర్‌ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ. 55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం – కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించారు.

గర్భిణీలకు మరో వరం కేసీఆర్‌‌ పౌష్టికాహార కిట్లు

గర్భిణీలకు మరో వరం కేసీఆర్‌‌ పౌష్టికాహార కిట్లు

రాష్ట్రంలోని మహిళల్లో రక్తహీనత అధికంగా ఉన్నందున దీని నివారణకు ప్రభుత్వం న్యూట్రీషియన్‌ కిట్ల పంపిణీని చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

వైద్యరంగంలో నూతన విప్లవం

వైద్యరంగంలో నూతన విప్లవం

దేశ వైద్య రంగంలో నూతన విప్లవానికి తెలంగాణ శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఒకేసారి 8 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి.

రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శం

రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శం

దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతే ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తున్నది.

విద్యుత్‌ ఉత్పత్తి లో దేశంలోనే అగ్రగామి

విద్యుత్‌ ఉత్పత్తి లో దేశంలోనే అగ్రగామి

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, విద్యుత్‌ కోతలతో, పవర్‌ హాలిడేలతో భయంకరమైన బాధలు అనుభవించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. నేడు యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ.

స్వచ్ఛ సర్వేక్షణ్ లో మనమే నెంబర్‌ వన్‌!

స్వచ్ఛ సర్వేక్షణ్ లో మనమే నెంబర్‌ వన్‌!

స్వచ్ఛ భారత మిషన్‌లో అద్భుత ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమంగా నిలిచింది. దేశంలో నెంబర్‌ వన్‌ ర్యాంకుతో పాటు, వివిధ కేటగిరిల్లో 13 స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు దక్కాయి.