భారత్ విక్రమం
విశ్వ మండలం విస్తుపోయింది.
చంద్రయానం చరిత్ర రాసింది.
ప్రజ్ఞాన విక్రమము వెన్నెల పై విచ్చుకుంది.
విశ్వమంతా జయ జయ ధ్వానం పలికింది.
విశ్వ మండలం విస్తుపోయింది.
చంద్రయానం చరిత్ర రాసింది.
ప్రజ్ఞాన విక్రమము వెన్నెల పై విచ్చుకుంది.
విశ్వమంతా జయ జయ ధ్వానం పలికింది.
ఎక్కడ పువ్వు రాలేదో అక్కడ గజ్జె ఘల్లుమనేది
ఎక్కడ నవ్వు పొలమారేదో అక్కడ ఆ గొంతు పురివిప్పేది
ఏడ్పులకు సంతోషాలకు మధ్య
కన్నీళ్లు ప్రవహించినప్పుడల్లా వంతెన కట్టేది ఆ పాట
తడారిపోయింది స్వరమాగిపోయింది
పొద్దుపొడుపు నలుపైంది
ఆకాశమంత మర్రిమాను నేలకూలింది
ఇప్పుడు పాట
మనముందు జెండయి నిలబడ్డది
సీ: జనములు మెచ్చంగ జనపథమ్ములు కొన్ని
దేదీప్యముగను వర్ధిల్లె నిచట
దేశ విదేశ యాత్రికులతో రాజ్య వై
భోగమ్ములే మారిపోయె నిచట
తెలంగాణ సాధించుకున్న తర్వాత సాహిత్యం కూడా కొత్త వెలుగును నింపుకుంది. అస్తిత్వాన్ని అన్వేషించుకుంది. స్థానాన్ని నిర్దేశించుకుంది. చిత్ర పరిశ్రమలో ఇంతకాలంగా తెలంగాణ భాషను వ్యంగ్యంగా చిత్రించిన దశనుండి ఆ భాష సొగసులను, సౌందర్యాన్ని, మాధుర్యాన్ని తెలిజేస్తూ వెండి తెరపై మెరుపులు ప్రదర్శించింది.
ఆధిపత్యాల అవమానాల పోరులో ఆత్మగౌరవానికై నేలకొరిగిన ధృవతారాల్లారా !
మీకు తంగేడు పూలవందనాలు !
భవిష్యత్ ను ఉద్యమానికి అంకితంచేసి పోలీసుల కాల్పుల్లో కన్నుమూసిన వీరులారా!
మీకు పాటల దండాలు!
తెలంగాణ ప్రభుత్వం తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. ఇందులో భాగంగా 2023 సంవత్సరానికిగాను దాశరథి పురస్కారాన్ని సంస్కృతాంధ్ర పండితులు, ప్రముఖ కవి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మకు ప్రదానం చేసింది.
తెలంగాణ మహోద్యమంలో ప్రజా యుద్ధగీతం. తెలంగాణ లడాయికై జై కొట్టిన అస్థిత్వ చైతన్యగీతం. దళితబహుజన సామాజిక గీతం. సకల ఆధిపత్యాల వివక్షలను నిరసించిన ప్రచండ గీతం సాయిచంద్.
అనాదిగా యువత కలలు కన్నది …
వెలుగుబాటలో భవిష్యత్తు సాగాలని
ఆశాకిరణాలతో జీవితం నిండాలని
నీళ్లు, నిధులు, నియామకాల తెలంగాణ కావాలని
తెలంగాణ గడ్డ ఉజ్వలమైన చరిత్రకు, సుసంపన్నమైన భాషా సాహిత్యాలకు, తరతరాలుగా జనావళిని ఉర్రూతలూగిస్తున్న కళారూపాలకు, విలక్షణ సంస్కృతికి ఆటపట్టు. తెలంగాణ గొప్పదనం తెలియని వారు మాట్లాడిన హేళన పూర్వక మాటలే అలనాడు సురవరం ప్రతాప రెడ్డిని గోలకొండ కవుల సంచిక రూపకల్పనకు పురి గొల్పినవి.