వ్యక్తులు

దోపిడీని ప్రశ్నించి, సమాజాన్ని   కదిలించిన కవి గూడ అంజయ్య

దోపిడీని ప్రశ్నించి, సమాజాన్ని కదిలించిన కవి గూడ అంజయ్య

తన పాటలతో, రచనలతో, కవితలతో, గానంతో సమాజాన్ని కదిలించి, దోపిడీని ప్రశ్నించిన కవి గూడ అంజయ్య. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, సామాన్యుల బతుకులు ఏవిధంగా దోపిడీకి గురవుతున్నాయో జీవితానుభవం ద్వారా తెలుసుకుని, ప్రజలను జాగృతం చేసే దిశగా రచనలు సాగించాడు.

దాశరధిరాసిన  రాసిన ‘ఈ ఎడాదిపాట ‘

దాశరధిరాసిన రాసిన ‘ఈ ఎడాదిపాట ‘

అది 1981వ సంవత్సరం. రవీంద్రభారతిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికి ఇంకా దూరదర్శన్‌ ప్రాశస్త్యంలోకి రాలేదు. ప్రజలంతా ఆకాశవాణి కార్యక్రమాలనే ఆదరిస్తున్న రోజులు కనుక ఆకాశవాణి అన్నా, అందులో పని చేస్తున్నవారన్నా జనబాహుళ్యంలో అభిమానం, ఆదరణ ఉండేవి.

పలికించినది చదువులతల్లి!

పలికించినది చదువులతల్లి!

తెలంగాణలోని ప్రాచీన సంస్కృతికీ, ఆలయాలూ నెలవైన ఖిల్లా ఇందూరు (నిజామాబాద్‌) జిల్లా. ఈ జిల్లాలో అపురూప దేవాలయాలకు నిలయమైన రథాలరామారెడ్డిపేటలో జన్మించిన జాతిరత్నం వల్లంభట్ల గుండయ్య భాగవతార్‌.

విప్లవ తేజం.. కాళోజీ

విప్లవ తేజం.. కాళోజీ

కాళోజీ పేరే విప్లవం. ఆయన మాటల్లోనే ”నా గురించి చెప్పు కోవాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తు వచ్చిన, అన్ని ఉద్యమాల్లో ధైర్యంగా పాల్గొన్న, ఎక్కడ అక్రమం జరిగినా దాన్ని ధిక్కరిస్తూ గేయమో, కథో రాసిన. నా గేయాలలో తొంభై ఐదు శాతం ఉద్యమాలపై రాసినవే. అవన్నీ గేయ రూపంలో ఉన్న స్టేటుమెంట్లే.”

ఏనుగెక్కిన పాండిత్యం!

ఏనుగెక్కిన పాండిత్యం!

కొందరికి కొన్నికొన్ని శాస్త్రాలలో పాండిత్యం వుంటుంది. కొందరికి కవిత్వం, కళలు మొదలైన వాటిలో నైపుణ్యం వుంటుంది. మరికొందరికి లౌకిక కార్యకలాపాలలో వ్యవహార దక్షత వుంటుంది. కానీ, విభిన్న రంగాలలో సమర్థుడుగా ఓ వెలుగు వెలిగిన మహోన్నత వ్యక్తి శాస్త్రుల విశ్వనాథ శర్మ.

కుంచె ”మంత్ర దండం” అయితే!!

కుంచె ”మంత్ర దండం” అయితే!!

ఇంధ్రజాలం వస్తువుగా తీసుకుని, తనకుంచెతో, కలంతో రంగురంగుల ఇంధ్రధనుస్సును సృష్టించి చూపరులను, మరీ ముఖ్యంగా బాలలను మంత్ర ముగ్ధులను చేస్తున్న చిత్రాలను రూపకల్పన చేసిన సృజనాత్మక చిత్రకారుడు జి.రంగారెడ్డి 

ఆయన నివాసం మల్లెల పందిరి

ఆయన నివాసం మల్లెల పందిరి

కార్మికుల హక్కుల కోసం సంఘటిత ఉద్యమాలను రూపొందించి, ముందుకు తీసుకువెళ్లిన నేత, దశాబ్దాల కాలం నగరంలో బలీయంగా ఎదిగిన ట్రేడ్‌ యూనియన్‌కు ప్రాణదాత, ఉన్నతమైన జీవితానికి నైతిక కట్టుబాట్లు అవసరమని భావించిన నీతి వర్తనుడు, పదవులకు అతీతంగా అర్థశతాబ్దంపైగా ప్రజా జీవితంలో కొనసాగిన ఆదర్శమూర్తి.. ఆయనే డాక్టర్‌ రాజ్‌ బహదూర్‌ గౌడ్‌. 

చరవాణి సురభి వాణీదేవి

చరవాణి సురభి వాణీదేవి

తనదైన బాణీలో వేసిన చిత్రాలకు ఆమె నాన్నగారు, సర్వకలాకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, పూర్వ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రశంసలు పొందారు. నిజానికి పి.వి. ప్రశంసలంటే మాటలా మరి? ఇంతకు ఆ చిత్రకారిణి పేరు సురభి వాణీదేవి.

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

హౖదరాబాద్‌ రాష్ట్రం నాయకులలో చాలా మంది, వారెక్కడ పుట్టినా హైదరాబాద్‌ నగరాన్నే కార్యరంగంగా ఎంచుకున్నారు. రాజధాని నగరం నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తూ తమ స్ఫూర్తినీ, ప్రేరణనూ జిల్లాలకు వ్యాపింపచేశారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఆనాటి నాయకత్వ స్థూల స్వరూపమిది. స్వామీ రామానంద తీర్థ కన్నడిగునిగా జన్మించినందువల్ల కర్నాటక ప్రాంత ప్రజలు ఆయనను తమ నాయకునిగా భావించే వారు.

అలరించిన హరికథా  మహోత్సవాలు

అలరించిన హరికథా మహోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి డాక్టర్‌ కె.వి. రమణ పుట్టిన రోజంటే కళాకారులందరికీ ఓ పండుగరోజు. కళాకారుల పట్ల ఆయనకు ఉన్న అభిమానం, గౌరవానికి ఇది నిదర్శనం.