|

దేశానికే అన్నపూర్ణ

ప్రజలకు మాంసం, చేపలు వంటి స్వచ్ఛమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నవని సీఎం తెలిపారు. బయటి నుంచి దిగుమతి చేసుకోనవసరం లేకుండా చేపల పెంపకం, గొర్రెల పెంపకం పథకాలను అమలు పరుస్తూ, కూరగాయలు, పండ్లు తదితర పౌష్టికాహారాన్నందించే ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహిస్తున్న దన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన భద్రతతో కూడిన ఆహారం లభిస్తున్నదని సీఎం తెలిపారు.

కలుషితమైన ఆహారం దరిచేరకుండా కల్తీ మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందన్నారు. కల్తీ విత్తనాలు ఎరువులు సహా ఆహార పదార్థాల కల్తీని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసి ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించే చర్యలు చేపడుతున్నదని సీఎం తెలిపారు.

‘‘ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’’ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

రోజు రోజు పెరిగి పోతున్న మధుమేహ వ్యాధి సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ‘‘తెలంగాణ సోనా’’ పేరుతో  షుగర్‌ ఫ్రీ వరి వంగడాలను రూప కల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వంగడాలను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని సీఎం అన్నారు.

అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని సీఎం అన్నారు. దాదాపు మూడు కోట్ల టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార భద్రతను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి చేరుకున్నదన్నారు. ‘‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’’ గా తెలంగాణ వ్యవసాయం రూపుదిద్దుకోవడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లభించి తద్వారా రెండు కరోనా సందర్భాల్లోనూ తెలంగాణ వ్యవసాయం అద్భుత ఫలితాలనిచ్చిందని సీఎం తెలిపారు. కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు మూతపడిన పరిస్థితుల్లో కూడా, తెలంగాణ రైతులు పండిరచిన పంట దేశానికే ఆహార భరోసాను కల్పించడం గొప్ప విషయమన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ వ్యవ సాయాన్ని, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా సాగునీరు, తాగునీరు లేక, తెలంగాణ అల్లాడిరదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న అనంతరం మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పటిష్టం చేసుకుని, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మించుకుని నేడు ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఎదుగుతుండడం, తెలంగాణ సమాజం గర్వపడే సందర్భమన్నారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి ఏటా రూ.45 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, ప్రజలకు ఆహార భద్రతతోపాటు సామాజిక జీవన భద్రత కూడా ప్రభుత్వం కల్పిస్తున్నదని సీఎం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తిండికి లోటు ఉండకూడదనే లక్ష్యంతో, ఆహార భద్రతను కల్పించడంలో భాగంగా, ఒక వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి  కిలో రూపాయి చొప్పున ‘‘ఆహార భద్రతా కార్డు (రేషన్‌ కార్డు)’’ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.  రేషన్‌ కార్డు కలిగిన మొత్తం 87,41,000 కుటుంబాల్లోని 2,79,27,000 (రాష్ట్ర జనాభాలో 72శాతం) మందికి కేవలం 1 రూపాయికి కిలో చొప్పున 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సాలీనా పంపిణీ చేస్తున్నదని సీఎం తెలిపారు. ఇందుకు గాను కిలో ఒక్కింటికి రూ.28.24 పైసల చొప్పున ప్రతి ఏటా రూ.2,088 కోట్ల సబ్సిడీని భరిస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సన్నబియ్యాన్ని అందిస్తూ ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తున్నదని సీఎం వివరించారు. 

రేషన్‌ కార్డుదారులు ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసు కునేలా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ పోర్టబిలిటీ రూపొందించడం ద్వారా తెలంగాణ పౌరులు రాష్ట్రంలో ఎక్కడున్నా ఆహార భద్రత లభించే ఏర్పాటును ప్రభుత్వం చేసిందని సీఎం అన్నారు.