మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతం
రాష్ట్రంలో 7500 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమెరికా పర్యటన విజయవంతమైంది. వారం రోజుల పర్యటనలో అమెరికాలోని దిగ్గజ కంపెనీల ఉన్నతాధికారులను కలిసి ఫార్మా, ఐటీ రంగంలో హైదరాబాద్ ఎదిగిన విధానాన్ని వారికి వివరించారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో సఫలీకృతమయ్యారు. ప్రముఖ అమెరికా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. క్వాల్కమ్, అడ్వెంట్ ఇంటర్ నేషనల్‌తోపాటు పలు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో రూ.7500కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. మంత్రి కేటీఆర్ అమెరికాలో వివిధ కంపెనీల ఉన్నతాధికారులు, ఎన్నారైలతో వరుస సమావేశాలు నిర్వహించారు. దాదాపు 35 బిజినెస్ మీటింగ్స్‌లో పాల్గొన్నా రు. ఓవైపు ఎన్నారైలతో స్వరాష్ట్ర అభివఅద్ధికి సహకరించాలని కోరుతూనే మరోవైపు కంపెనీలతో భేటీ అవుతూ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఎన్నారైలతో భేటీలో.. ప్రభుత్వ బడుల బాగు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా సాయం చేసి, తాము చదువుకొన్న పాఠశాల అభివఅద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అనేకమంది ఎన్నారైలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో దిగ్గజ కంపెనీ క్వాల్కమ్ సంస్థ మంత్రి కేటీఆర్ చర్చల ఫలితంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించేందుకు ముందుకొచ్చింది. రూ.3905 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.

ప్రముఖ కంపెనీల పెట్టుబడుల హామీలు
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న అడ్వెంట్ ఇంటర్‌నేషనల్ కంపెనీ రాష్ట్రంలోని ఫార్మారంగంలో రూ.1750 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఫిష్ ఇన్ సంస్థ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఫార్మా కొపియా, క్యూరియా గ్లోబల్ సంస్థలు, ప్రముఖ ఐటీ సంస్థ స్ప్రింక్లర్, ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ కాన్లుయెంట్ మెడికల్ వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
పర్యటన విజయవంతం: మంత్రి కేటీఆర్
వారంపాటు సాగిన అమెరికా పర్యటన విజయవంతం కావడంపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా పంచుకొన్నారు. ఈ వారం రోజుల పర్యటనలో 35 బిజినెస్ సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి రూ.7500 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినట్లు వెల్లడిరచారు. తన పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన ఎన్నారైలకు, తన బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.