మాదిరి ప్రశ్నలు

1. క్రతువుతో పునర్జన్మ పొంది క్షత్రియుడిగా ప్రకటించుకున్న రాజు? 

1) రాష్ట్రకూట దంతిదుర్గుడు         2) రాష్ట్రకూట కృష్ణుడు

3) చాళుక్య సోమేశ్వరుడు           4) చోళ రాజరాజు

2. పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా, క్రతువుతో  పునర్జన్మ పొందడానికి నిర్వహించే సంస్కార విధి? 

1) అక్షయ గర్భ        2) హిరణ్య గర్భ 

3) క్షీర గర్భ             4) రజత గర్భ

3. బ్రాహ్మణులైనప్పటికినీ, ఆయుధాలు ధరించి రాజ్యాలు స్థాపించినవారు? 

ఎ. కదంబ మయూరశర్మ              బి. చాళుక్య పులకేశి

సి. కాకతీయ రుద్రమ                 డి. ఘార్జర ప్రతిహార హరిశ్చంద్రుడు

1) ఎ, బి           2) బి, సి, డి 

3) ఎ, డి           4) ఎ

4. శాసనాల్లోని ప్రశస్తిలో సాధారణంగా పేర్కొనని అంశాలు?  

1) పాలకుల కుటుంబాలు, వారి పూర్వీకులు       

2) వారి పరిపాలనా కాలం 3) వారి ఘనతలు, విజయాలు 

4) వారి అపజయాలు, అవమానాలు

5. కశ్మీర్‌ను పాలించిన 12వ శతాబ్దంలో అసాధారణ సంస్కృత పద్యం రాసినది? 

1) కల్హణుడు               2) భానుడు      

3) గుణాఢ్యుడు           4) కాళిదాసు

6. గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంపై దాడిచేసి సంపద దోచుకున్న పాలకుడు? 

1) మహ్మద్‌ ఘోరీ    2) మహ్మద్‌ గజనీ     

3) మహ్మద్‌ ఖాన్‌ ఖాసీం    4) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌

7. గంగానది లోయలోని కనోజ్‌ కోసం జరిగిన యుద్ధంలో పాల్గొనని రాజవంశం? 

1) ఘార్జర ప్రతిహారులు     2) రాష్ట్రకూటులు 

3) పాల వంశీయులు      4) కదంబులు

8. త్రైపాక్షిక పోరాటం ఎవరి మధ్య జరిగింది?

1) చోళులు, చాళుక్యులు, పల్లవులు

2) యాదవులు, చాళుక్యులు, కదంబులు

3) ఘార్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాల వంశీయులు

4) గహద్వాలులు, చౌహానులు, పరమారులు

9. గజనీ మహ్మద్‌తో వచ్చి భారత ఉపఖండం గురించి రచనలు చేసిన పండితుడు? 

1) అల్‌ బెరూనీ       2) అబుల్‌ ఫజల్‌        

3) అబ్దుల్‌ లతీఫ్‌     4) ఉస్తాద్‌ మన్సూర్‌

10. కితాబ్‌ అలహింద్‌ అనే అరబ్‌ గ్రంథాన్ని రాసినది? 

1) తాన్సేన్‌            2) గుల్బదన్‌ బేగం   

3) అమీర్‌ ఖుస్రూ     4) అల్‌ బెరూనీ

11. చౌహానులు పాలించిన నేటి ప్రాంతాలు? 

1) గుజరాత్‌          2) ఢిల్లీ, అజ్మీర్‌ 

3) బెంగాల్‌           4) బీహార్‌

12. చౌహానులను వ్యతిరేకించిన పాలకులెవరు? 

ఎ. చాళుక్యులు      బి. తోమరులు     

సి. గహద్వాలులు      డి. పాల వంశీయులు

1) ఎ, సి        2) ఎ, సి, డి    

3) బి, సి        4) బి, సి, డి

13. 1191లో మూడో పృథ్వీరాజ్‌ చేతిలో ఓటమి పొందిన అఫ్ఘాన్‌ పాలకులు? 

1) మహ్మద్‌ ఘోరీ        2) మహ్మద్‌ గజనీ      

3) జలాలుద్దీన్‌            4) బాబర్‌

14. 1192లో జరిగిన యుద్ధంలో మహ్మద్‌ ఘోరీ చేతిలో ఓటమి పొందిన రాజపుత్ర వీరుడు? 

1) బప్పారావల్‌         2) మూడో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ 

3) రన్‌ కుంభ          4) చిత్తోర్‌ను పాలించిన శివదేశ్‌

15. కంచి పల్లవులకు సామంతులుగా కావేరీ, డెల్టాపై అధికారం పొందినది? 

1) వెల్లాల కుటుంబం 2) ఉత్తరాయర్‌ కుటుంబం 

3) కలబూలు 4) కదంబులు

16. కింది వారిలో ఎవరు ఉత్తరాయర్ల కావేరీ డెల్టాపై దండెత్తి, ఆక్రమించి రాజ్యస్థాపనకు పూనుకున్నారు? 

1) విజయాలయుడు 2) మొదటి రాజరాజు  

3) రాజేంద్ర చోళుడు 4) రెండవ రాజరాజు

17. విజయాలయుడు నిర్మించిన పట్టణం, దేవాలయాలు ఏవి?

1) కాంచీపురం, మహేశ్వరాలయం 

2) తంజావూరు, నిశుంభ సూదిని దేవాలయం 

3) గంగైకొండ చోళపురం, రాజరాజేశ్వరాలయం

4) తంజావూరు, బృహదీశ్వరాలయం

18. చోళ రాజుల్లో అతి శక్తిమంతుడిగా కీర్తి పొందినది ఎవరు? 

1) విజయాలయ  2) విజయాలయ

3) మొదటి రాజరాజు  4) రాజేంద్ర చోళుడు

19. రాజేంద్రచోళుడు పటిష్టపర్చిన సైనిక దళం?

1) కాల్బలం       2) అశ్విక దళం 

3) గజ దళం       4) నౌకాదళం

20. మొదటి రాజేంద్రచోళుడు ఆక్రమించని ప్రాంతాలు? 

1) గంగానది లోయ    2) శ్రీలంక 

3) ఆగ్నేయాసియా      4) సింధులోయ ప్రాంతాలు

21. మొదటి రాజేంద్రుడు నిర్మించిన దేవాలయాలు, శిల్పకళాభివృద్ధి నిదర్శనాలు ఏవి? 

1) తంజావూరులోని గంగైకొండ, చోళపురం దేవాలయాలు

2) కాంచీపురంలోని పరమ మహేశ్వరాలయం

3) తంజావూరులోని నిశుంభ సూదిని దేవాలయాలు

4) మధురైలోని కామాక్షి దేవాలయాలు

సమాధానాలు

1-1, 2-2, 3-3, 4-4, 5-1, 6-4, 7-3, 

8-2, 9-1, 10-4, 11-2, 12-1, 13-1, 14-2, 

15-2, 16-1, 17-2, 18-3, 19-4, 20-4, 21-1