ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నం
దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా ఎన్నదగిన మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేటితో ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్నది. తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నది.