‘రాజీ’కి రాజబాట హైదరాబాద్!
హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరింది. నగరంలోని నానక్ రామ్ గూడ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐ.ఏ.ఎం.సి) కొలువు దీరింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.