బంగారు తెలంగాణకు బాటలు సబ్బండవర్గాలు అట్టడుగు ప్రజలకు ఆదరణ.. ఆపన్నులకు అమృతహస్తం
ప్రజల పనియే పాలకుని పని. ప్రజల సుఖమే పాలకుని సుఖం. ప్రజల ప్రియమే పాలకుని ప్రియం. ప్రజల హితమే పాలకుని హితం’’ ఇవీ మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పిన రాజనీతి హితవచనాలు.
ప్రజల పనియే పాలకుని పని. ప్రజల సుఖమే పాలకుని సుఖం. ప్రజల ప్రియమే పాలకుని ప్రియం. ప్రజల హితమే పాలకుని హితం’’ ఇవీ మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పిన రాజనీతి హితవచనాలు.
గౌరవనీయులు శాసనమండలి అధ్యక్షులు, గౌరవ అసెంబ్లీ స్పీకర్, గౌరవ శాసనమండలి, శాసనసభ సభ్యులకు నమస్కారాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ పదవీ కాలం దిగ్విజయంగా సాగాలని, మీరంతా అంకితభావంతో ప్రజాసేవలో నిమగ్నం కావాలని మనసారా అకాంక్షిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరులకు నివాళులు.