పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యి కి పైగా గ్రామాలకు తాగు నీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తుది అటవీ అనుమతులను మజూరు చేసింది.