నీలో దీపం వెలిగించు … నీవే వెలుగై వ్యాపించు
భారతీయ విజ్ఞానం అంతా ప్రకృతి ధర్మంతో ముడిపడి ఉంటుంది. ప్రకృతి యొక్క మార్పులకు అనుగుణంగా మన శరీర మానసిక వ్యవహారాలను మార్చుకుంటూ ఉండాలి. వానికి సరియైన విధి విధానాలను మన సంస్కృతి సంప్రదాయాలు సూచిస్తుంటాయి. వానిలో భాగమైనవే మనం నిర్వహించే అనేక వ్రతాలు, దీక్షలు, పండుగలు.