రాష్ట్రపతి పాలన పెడితేనే చర్చలు
‘‘తక్షణం రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టినట్లయితే ఇలాంటి చర్చలకు వీలుకలుగుతుంది’’ అని చెన్నారెడ్డి సూచించారు. ‘‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు రావాలని మీరు కోరుతున్నాం’’అని చవాన్ ప్రశ్నించగా, డా॥ చెన్నారెడ్డి తమ చేతి గడియారం వంక చూచి ‘‘ఇప్పుడు 7 గంటలకు పది నిముషాలు తక్కువగా ఉంది. 7 గంటలకు రాష్ట్రపతిపాలన వస్తే నేను ఆనందిస్తాను.