ప్రజల హృదయాలు గెలిచిన ప్రభుత్వం
”దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా, జాతి నిర్మాణంలో చక్కటి పాత్ర పోషిస్తున్నది. గడిచిన నాలుగున్నర ఏండ్లు తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాయి. కె. చంద్రశేఖర రావు నేతృత్వంలో ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం అన్ని రంగాలలో పునర్నిర్మాణ ప్రక్రియను ఉజ్వలంగా చేపట్టింది.