ఈవీ కేంద్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ఈ పాలసీ అత్యుత్తమంగా ఉండడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు తెలంగాణనే ఎంచుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.