‘మిషన్ కాకతీయ’ సఫలతకు వినూత్న పథకాలు
తెలంగాణ ఉద్యమ కాలంలో సాగునీటి రంగంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన అన్యాయం, చూపిన వివక్ష గురించి చాలా చర్చ జరిగింది. ఆ చర్చలో ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరువుల విధ్వంసం గురించి మధన పడినాము.
తెలంగాణ ఉద్యమ కాలంలో సాగునీటి రంగంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన అన్యాయం, చూపిన వివక్ష గురించి చాలా చర్చ జరిగింది. ఆ చర్చలో ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరువుల విధ్వంసం గురించి మధన పడినాము.
తెలంగాణకు గోదావరి బేసిన్ లో 165 టి ఎం సి లు, కృష్ణా బేసిన్లో 90 టి ఎం సి లు మొత్తం 255 టి ఎం సి లు చిన్న నీటి వనరుల కేటాయింపులు ఉన్నాయి. కాని తెలంగాణలో చిన్ననీటి వనరుల వినియోగం 90 టి ఎం సి లకు మించి లేదు.
ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఉన్నది. ప్రజా హితంలోనే రాజు హితం ఉన్నది. రాజు తనకు ప్రియమైన దానినే హితమనుకొనూడదు. ప్రజలకు ఏది ప్రియమో అదే తన హితం.
మనం రాష్ట్రంలో ప్రారంభించిన మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. అక్టోబరు 7న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో మిషన్ కాకతీయపై జరిగిన లఘు చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
ఊరికి చెరువే గుండెకాయ కదా, గుండె చెరువయ్యే చెరువు కథ ఎంతచెప్పినా వొడువని నేలతండ్లాట కథేకదా. అందుకే చెరువు కథ చెప్పడానికి ఉపక్రమిస్తే అది కావ్యంకాక మరేమవుతుంది? చెరువు ఒక దీర్ఘానుభవ సమాహారం.
శ్రీ శ్రీధరరావు దేశ్పాండే
మిషన్ కాకతీయ చెరువు పునరుద్దరణ పనులను గత ఏడాది మార్చి 12న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ పాత చెరువులో ప్రారంభించారు. మిషన్ కాకతీయ పనులను అయిదు దశల్లో ఏదాదికి 20 శాతం చెరువును ఎంపికచేసుకొని పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’ అద్భుత పథకమని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధిగాంచిన రాజేంద్ర సింగ్ కొనియాడారు.
తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో ప్రజలు ఆనాడు తమకు తోచిన పద్ధతుల ద్వారా ఉద్యమానికి చేయూతనిచ్చినారు. ఇవ్వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ‘మిషన్ కాకతీయ’ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కూడా తెలంగాణ సమాజమంతా అలాంటి సంఫీుభావాన్ని , సహకారాన్ని అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ‘మిషన్ కాకతీయ’ పనులను నీతిఆయోగ్ కమిటీ సభ్యులు వీకే సారస్వత్ మెచ్చుకున్నారు. మిషన్ కాకతీయనే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని, వీటిని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువే ఆదరువు. కాకతీయ కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పెద్ద సంఖ్యలో జరిగింది. ఆ తరువాత ఆధికారంలోకి వచ్చిన అసఫ్జాహీ, కుతుబ్షాహీల పాలనా కాలంలో కూడా పాత చెరువులను పరిరక్షిస్తూ మరెన్నో కొత్త చెరువులు కూడా నిర్మించారు.