రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ భారీ పెట్టుబడితో పరిశ్రమను నెలకొల్పనుంది. విద్యుత్ వాహనాల రంగంలో ప్రపంచంలో వున్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న అమెరికాకు చెందిన ట్రైటన్ ఈవీ కంపెనీ, తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రాష్ట్రంలో సూమారు రూ. 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రగతి భవన్‌లో జరిగిన ఒక సమావేశంలో పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. మంత్రి కేటిఆర్ సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ట్రైటన్ భారత విభాగాధిపతి మహ్మద్ మన్సూర్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.