మిషన్ కాకతీయ భేష్ నీతిఆయోగ్ సభ్యులు సారస్వత్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ‘మిషన్ కాకతీయ’ పనులను నీతిఆయోగ్ కమిటీ సభ్యులు వీకే సారస్వత్ మెచ్చుకున్నారు. మిషన్ కాకతీయనే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని, వీటిని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.