11 వేల ఎకరాలలో ఫార్మా సిటీ
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ముచ్చర్ల పరిధిలో 11వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటి (ఔషధ నగరి)ని నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ ఫార్మా సిటి నెలకొల్పడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 70వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.