హస్తినలో కేసీఆర్ మంత్రాంగం
ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనానికి కేంద్ర బడ్జెట్ సమర్పణ అనంతరం ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఇనుము, ఉక్కు శాఖల మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సుముఖత వ్యక్తం చేశారు.