విజయపథంలో మరో బడ్జెట్
‘చీకటి నుంచి వెలుగులోకి, అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతిలోకి రాష్ట్రప్రజలను నడిపిస్తున్నాం” అని తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఐదవ బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖామంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రసంగానికి రాష్ట్ర బడ్జెట్ అద్దం పట్టింది.