స్వీయపన్నుల రాబడిలో నెంబర్ వన్: ఆర్థికమంత్రి హరీష్‌రావు
స్వీయపన్నుల రాబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీష్‌రావు తెలిపారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధికేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ఆదాయానికి సంబంధించి పలు విషయాలు గణాంకాలతో సహా వివరించారు.