TELANGANA STATE

ప్రజల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి నింపిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

ప్రజల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి నింపిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ రాష్ట్రమంతటా ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపుతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా, జాతి గర్వపడేలా ఉత్సవాలను జరుపుకున్నారు

తెలంగాణ పోలీస్‌ శాఖకు 2 జాతీయ అవార్డులు

తెలంగాణ పోలీస్‌ శాఖకు 2 జాతీయ అవార్డులు

తెలంగాణ పోలీస్‌ శాఖకు,ఉత్తమ పనితీరు కనబరిచినందుకు, రెండు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. డాటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(డీఎస్‌సీఐ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కాం) సంయుక్తంగా వివిధ దర్యాప్తు ఏజెన్సీలకు వేరు వేరు క్యాటగిరీలలో అవార్డులను ప్రకటించాయి.మొదటి అవార్డు, సైబర్‌ నేరాల దర్యాప్తులో అనుసరిస్తున్న వ్యూహాలు, సిబ్బందిని సైబర్‌ వారియర్స్‌గా మార్చే విధానంలో తీసుకునే చర్యలకు సంబంధించి డీఎస్‌సీఐ ఎక్సలెన్స్‌ అవార్డు-2021 లభించింది.ఆ విధంగా పోలీస్‌ ఏజెన్సీల సామర్థ్యాల పెంపుదలలో మొదటి స్థానంలో నిలిచింది.

వేగంగా సచివాలయ నిర్మాణ పనులు… పరిశీలించిన సీఎం కేసీఆర్‌

వేగంగా సచివాలయ నిర్మాణ పనులు… పరిశీలించిన సీఎం కేసీఆర్‌

నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ పనుల తీరుతెన్నులను సీఎం పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.