ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు నిధులు విడుదల చేయండి
చిన్ననీటి వనరులకు సంబంధించి కేంద్ర పథకమైన ట్రిపుల్ ఆర్ (రిపేర్స్, రినోవేషన్, రిస్టోరేషన్) ప్రాజెక్టు కింద రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతికి విజ్ఞప్తి చేశారు.