ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం – యాదాద్రి
పర్యావరణ అనుకూల విధానాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి అత్యద్భుతంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. కేవలం ఆలయానికి వచ్చే భక్తులను ఆకట్టుకోవడమే కాదు మరో అరుదైన ఘనత సాధించింది.