తలపుల వీణ

talupula

ప్రేమ తెలుసుకోండి-దాని, విలువ తెలుసుకోండి, ప్రేమలేని జీవితానికర్ధంలేదండి..’ అంటూ ప్రేమ విలువను, అమ్మగూర్చి ఎంత చెప్పినా అది అందమే, అమ్మగూర్చి ఎంత రాసినా అది గంథమే, అమ్మకెంత సేవచేసినా అది పున్నెమే, అమ్మసేవ చేసినోడికి నా దణ్నమే.. అంటూ అమ్మవిలువను తెలుపుతూ, ఇలా ఎంతో విలువైన 60 పాటలతో ముద్రించిన ‘తలపుల వీణ’ పుస్తకం నిజంగా పాటలతోటే. కవి, గాయకుడు చెఱకు సత్యనారాయణ రెడ్డి రాసిన ఈ పాటలు ఎంతో అర్ధవంతంగా, రసవంతంగా వున్నాయి.

తలపుల వీణ, రచన- చెఱకు సత్యనారాయణ రెడ్డి, పేజీలు- 90, వెల రూ.100. ప్రతులకు-సి.సత్యనారాయణ రెడ్డి, కేరాఫ్‌ ఉదయభాస్కర్‌ చందుపట్ల, ఫ్లాట్‌ నం. 201, బ్లాక్‌ నం. 2, హల్‌ మార్క్‌ రెయిన్‌ వ్యాలీ, అలకాపురి టౌన్‌ షిప్‌, నెక్‌ నామ్‌ పూర్‌ గ్రామం, హైదరాబాద్‌- 500 089.