నాడు కూలీలు.. నేడు యజమానులు
- జి. లక్ష్మణ్ కుమార్
తెలంగాణ ‘దళితబంధు’ లక్ష్యం నేరవేరుతున్నది. దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పేదరికం తాండవించిన దళిత వాడల్లో మహాలక్ష్మిలా దళిత బంధు వచ్చింది. లబ్ధిదారుల సెల్ ఫోన్‌లలో నగదు పడ్డట్టు.. టింగ్.. టింగ్..మని మెసేజ్ లు వస్తుండటంతో ఆయా కుటుంబాలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తొలి జాబితాలోని 15 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.లబ్ధిదారులకు అధికారులే ‘‘తెలంగాణ దళిత బంధు ‘‘పేరిట ప్రత్యేకంగా ఖాతాలను తెరిచారు.లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలతో పాటు పదివేల రూపాయలు దళిత రక్షణ నిధి కింద జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు దళితబంధు పథకాన్ని వేగవంతం చేశారు.
తెలంగాణ దళిత బంధుపథకం అమలులో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో కమలాపూర్ మండలలో శనిగరం గ్రామానికి చెందిన రాజేందర్, కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మట్ల సుభాష్, కన్నూర్ గ్రామనికి చెందిన కనకం రవిందర్‌ల యూనిట్లను గ్రౌండిరగ్ పూర్తి చేసారు. లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు ఆన్ లైన్ ద్వారా అధికారులు జమ చేసారు.వ్యవసాయ కూలీలా పని చేసిన ఈ ముగ్గురు లబ్ధిదారులకు దళిత బంధు సొమ్ముతో తాము కోరుకున్నయూనిట్లు మంజూరు చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఒక్క నాంపల్లి రాజేందర్ కో.. మట్ల సుభాష్ కో.. కనకం రవిందర్ కో పరిమితం కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన గాధ..వ్యధాభరిత జీవితాలు. ఇలాంటి పేద దళిత కుటుంబాలకు దళిత బంధు పధకం కల్పవృక్షంగా మారిందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తికాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతోంది దళిత సమాజం.
దళితుల అభ్యున్నతికే దళిత బంధు పథకం
- హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

దళితులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసు కుని రావడమే దళిత బంధు లక్ష్యం.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలాన్ని 12 క్లష్టర్లుగా విభజించి, 32 మంది అధికారులతో బృందాలు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో పారదర్శకంగా దళిత బంధు సర్వేను చేపట్టాం.దళిత బంధు పథకం కింద ఇప్పటి వరకు 3788 మందికి లబ్దిదారులకు.. అంటే ఒక్కో దళిత కుటుంబాని పదిలక్షల రూపాయల చొప్పున ఆన్లైన్ ఎకౌంట్లలలో జమ చేశాం.లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లను మంజూరు చేస్తున్నం. దళిత బంధు సొమ్ముతో దళితులు జీవితంలో చక్కగా స్థిరపడాలి.దళిత సాధికారత సాధిచాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.
కొత్త జీవితం మొదలెడ్త
- నాంపల్లి రాజేందర్, శనిగరం గ్రామం

ఇంటిల్లిపాది పని చేసోటోల్లం. నాకు ఊళ్ళో గుంట భూమి కూడా లేదు.రెక్కాడితే డొక్కాడని బతుకులు మాయి. నాలాంటోల్లకి పది లక్షలు ఇస్తారు.. అంటే నేను మొదట్లో నమ్మలే…. ఫోన్లో మెసేజ్ చూసినంకనే… నమ్మిన.. ఇగ ఇబ్బందులు తీరినట్లే..ఈ డబ్బులతో కొత్త జీవితం మొదలెడ్త.. కేసీఆరు సారుకు జీవితాంతం రుణ పడి ఉంట.

పది మందికి పని ఇప్పిస్త
- మట్ల సుభాష్, కమలాపూర్ మండల కేంద్రం
చిన్నప్పటి నుంచి కూలీకి పోతున్న. ఊళ్ళో పార పనికి పోయోటోన్ని. డప్పు కూడా కొట్టేటోన్ని. గత పదేళ్లుగా సెంట్రింగ్ పనులలో కూలిగ వెళ్తున్న. దళితబంధు పథకం డబ్బులుతో సెంట్రింగ్ సామాను కొనుక్కున్న. ఇప్పటికే బిల్డింగ్‌లకు సెంట్రింగ్ బిగిస్తున్న.. ఇప్పుడు నేనే పది మందికి పని ఇప్పిస్త. అంత సారు దయ.

కొత్త ట్రాక్టరు తో జీవితం బాగు వడ్తతి
- కనకం రవిందర్, కన్నూర్ గ్రామం
గత నలభై ఏళ్ళుగా ట్రాక్టరు డ్రైవర్‌గ పని చేసిన. సారు ఇచ్చిన పైసలతో కొత్త ట్రాక్టరు కొన్న. నేను ఓనర్ అవుతానని కలలో కూడా అనుకోలే. మాటల్లో చెప్పలేక పోతున్న. కేసీఆర్ సారుకి, కలక్టర్ సారుకి దండాలు. పిల్లల్ని మంచిగా సదివించుకుంట.